Aug 21, 2020, 11:36 AM IST
అనకాపల్లి చివర తోటాడ వెళ్లే మార్గంలో ఓ భర్త , భార్యను చంపిన సంఘటన కలకలం రేపింది. అనకాపల్లికి చెందిన ఇళ్ల వి నాయుడుకు ఇద్దరు భార్యలు, మొదటి బార్య నాగులాపల్లి సూర్యకాంతంకు ఇద్దరు కొడుకులు. గురువారం చిన్న కొడుకు చనిపోవడంతో రెండో భార్య సన్యాసమ్మతో అక్కడికి వెళ్లి వచ్చాడు. అనంతరం తాగడానికి డబ్బులు అడగడంతో సన్యాసమ్మ లేవని చెప్పడంతో అక్కడికక్కడే భార్యను చంపేశాడు. సన్యాసమ్మకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.