Jun 15, 2021, 6:19 PM IST
గుంటూరు: తాడికొండ మండల పరిధిలోని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల అంతర్గత బదిలీల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఎంపిడిఓ అనురాధ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఉన్నతాధికారుల దృష్టికి లేకుండా అక్రమ బదిలీలు చేశారంటూ రావెల, కంతెరు గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే డిపివో, జడ్పి సీఈవో లకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఓ వర్గానికి ఎంపీడీఓ కొమ్ము కాస్తుందంటూ తాడికొండ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు రావెల, కంతేరు గ్రామస్తులు.