Feb 25, 2021, 1:51 PM IST
గన్నవరం: ఇంటింటికి రేషన్ పంపిణీ తమ వల్ల కాదంటూ వివిధ కారణాలతో వాహన అపరేటర్లు రాజీనామా పత్రాన్ని అధికారులకు అందజేసిన ఘటన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో చోటుచేసుకుంది. మండలానికి మొత్తం 10 వాహనాలను ప్రభుత్వం అందజేయగా ఆత్కూరు, నాగవరప్పాడు, వేంపాడు, ఉంగుటూరు గ్రామాల్లోని ఐదుగురు అపరేటర్లు తమ రాజీనామా పత్రాలను ఎంపీడీఓ జ్యోతికి అందజేశారు. క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొవడంతో పాటు అధికారులు, ప్రభుత్వం నుంచి ఉన్న ఒత్తిడిలు భరించలేక రాజీనామా చేస్తున్నట్లు ఆపరేటర్లు తెలిపారు.