Jun 16, 2022, 1:36 PM IST
విజయవాడ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీని విచారణ పేరుతో ఈడీ వేధించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఏఐసిసి ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు దిగాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ సాకే శైలజానథ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు విజయవాడలో ఆందోళన సిద్దమయ్యారు. దీంతో పోలీసులు శైలజానాథ్ ను హౌస్ అరెస్ట్ చేసారు. ఇలా కొందరు నాయకులను హౌస్ అరెస్ట్, మరికొందరిని ముందస్తుగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు రాజ్ భవన్ వద్ద ఎలాంటి ఆందోళనలు జరక్కుండా చూసుకున్నారు. ఇప్పటికే రాజ్ భవన్ వద్ద నిరసనలకు అనుమతి లేదని ప్రకటించిన పోలీసులు అందుకు సిద్దమవుతున్నవారిని అదుపులోకి తీసుకున్నారు.