May 31, 2021, 5:43 PM IST
గుంటూరు నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి సిద్దపడ్డాడని ఓ యువకుడిపై కత్తితో దాడి చేశారు మరో యువకుడు. విచక్షణా రహితంగా కత్తితో దాడిచేయడంతో గాయపడ్డ యువకుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కొంతకాలంగా నిందితుడు ప్రేమ పేరిట అమ్మాయిని వేధిస్తున్నాడు. అయితే అతడి ప్రేమను సదరు యువతి అంగీకరించలేదు. అంతేకాకుండా మరో యువకుడితో ఆమెకు పెళ్లి నిశ్చయమయ్యింది. దీంతో సైకోగా మారిపోయిన నిందితుడు కాబోయే భర్తతో కలిసి బయటకు వచ్చిన సమయంలో కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.