Nov 19, 2019, 5:04 PM IST
ఆర్టీసీ డ్రైవర్ చింతా నాగేశ్వరరావు మృతి కేసులో న్యాయం జరగాలని, కేసును పక్కదారి పట్టిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత, ప్రజాసంఘాల ఐక్యవేదిక, ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐక్య వేదిక కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ, దళిత విముక్తి కన్వీనర్ సుర్ల వెంకట రమణ, బాధితులు మాట్లాడారు.