Apr 24, 2020, 3:40 PM IST
శ్రీకాకుళం జిల్లా వంగర మండలం తలగాం గ్రామానికి చెందిన వరలక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో 108కు ఫోన్ చేశారు. అయితే 108 అందుబాటులో లేదని చెప్పడంతో ఆటోలో విజయ నగరం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి బయల్దేరారు. మార్గమధ్యలోనే నొప్పులు ఎక్కువయ్యి కాన్పు అయిపోయింది. ఆటోలోనే పండంటి పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.