విశాఖ కోర్టుకు కేఏ పాల్ ... న్యాయ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు

Dec 16, 2022, 4:23 PM IST

 విశాఖపట్నం : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ఓ కేసు విషయంలో విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. ట్రస్ట్ వివాదంలో గత 16ఏళ్లుగా న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నానని అన్నారు. భూపాల్ రెడ్డి అనే కరప్టెడ్ జడ్జి వారం, నెలరోజులకు ఒకసారి వాయిదా వేసేవాడని... ఇలా ఈ కేసును 700-800 సార్లు వాయిదా వేసారని అన్నారు. నాకే ఈ పరిస్థితి వుంటే సామాన్యుల పరిస్థితేంటి అన్నారు. పార్లమెంట్ లో బిల్లుపెట్టి ఈ వ్యవస్థను మార్చాలని... సుప్రీం కోర్టు, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ స్పందించాలన్నారు. డిస్మిస్ అయిపోయిన కేసులను కొందరు న్యాయవాదులు ఉద్దేశపూర్వకంగా తిరగతోడుతున్నారని... ఇలా కోర్టు సమయం వృధా చేస్తున్న న్యాయవాదులపై సుప్రీంకోర్టు,హైకోర్టు చీఫ్ జస్టిస్ లకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. తన కేసులో సత్వర న్యాయం చేయాలని... పరిష్కారం లభించకపోతే నిరాహారదీక్ష చేస్తానని కేఏ పాల్ అన్నారు.