సిపిఎం ఆధ్వర్యంలో బిజెపి వ్యతిరేకంగా ప్రజా చైతన్య యాత్ర..

Sep 14, 2022, 2:23 PM IST

కృష్ణాజిల్లా : సిపిఎం ఆధ్వర్యంలో బిజెపి వ్యతిరేకంగా ప్రజా చైతన్య యాత్ర కృష్ణా జిల్లా అధ్యక్షుడు రఘు  ప్రారంభించారు. ఆదానీలు, అంబానీల కార్పొరేట్ ఊడిగం చేస్తూ ప్రజలపై భారం మోపుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు తిప్పి కొట్టండని పిలుపునిచ్చారు. దేశభక్తి ముసుగులో ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి బిజెపి పబ్బం గడుపుకుంటుందన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీలు అమల్లోకి రానివ్వకుండా రాష్ట్రాన్ని దగా చేసిన మోడీ సర్కార్ నిలదీయడన్నారు. ఈనెల 24 వ తారీకు విజయవాడ జింఖానా గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని.. దీనికి సిపిఎం ప్రధాన నాయకుడు సీతారాం ఏచూరి సభకు హాజరవుతారని తెలిపారు.