కంచికచర్లలో పోలీసుల తనిఖీలు...బస్సులో భారీగా పట్టుబడ్డ నగదు

Jan 21, 2021, 1:42 PM IST

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. గరుడ బస్సులో తరలిస్తున్న రూ.50 లక్షల రూపాయల నగదును తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్న పోలీసులు తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఈ డబ్బు వైజాగ్ నుండి హైదరాబాద్ తీసుకు వెళ్తున్నట్లు గుర్తించారు.