కారుతో సహా నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తి.. (వీడియో)

Oct 21, 2020, 1:00 PM IST

తూర్పుగోదావరి జిల్లా, ప్రత్తిపాడు లంపకలోవ రహదారి మధ్య సుద్దగడ్డవాగులో కారుతో సహా వ్యక్తి కొట్టుకుపోతుండగా పోలీసులు కాపాడారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన అంబటి వీరవెంకట సత్యనారాయణ కారు వాగు ప్రవాహానికి కాజ్‌వే నుంచినీటిలోకి జారి కొట్టుకుపోయింది. సత్యనారాయణ కారులోనుండే 100కి ఫోన్‌ చేయగా హైవే మొబైల్‌ సిబ్బంది వచ్చారు. కాజ్‌వేపై రెండు అడుగుల ఎత్తులో ప్రవాహజోరు ఉండడంతో కారును వెలుపలు తీసేందుకు యంత్రాంగం తీవ్రప్రయాస పడింది. సత్యనారాయణను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.