ప్రధాని మోదీని అడ్డుకునే ప్రయత్నం... విమానాశ్రయానికి వెళుతున్న సుంకర పద్మశ్రీ అరెస్ట్

Jul 4, 2022, 11:19 AM IST

విజయవాడ : అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల కోసం ఏపీకి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని అడ్డుకోడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని రాక సందర్భంగా గన్నవరం విమానాశ్రయం ముందు నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు సిిద్దమయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ శ్రేణులు విమానాశ్రయం వద్దకు వెళ్లకముందే మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. అక్కడే మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో పద్మశ్రీ తో పాటు మిగతావారిని పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.