Jun 29, 2020, 10:12 AM IST
ఆర్థిక మంత్రి బుగ్గన నియోజకవర్గం డోన్ లో అసంతృప్తి సెగలు ఎగుస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతంతమాత్రంగానే కార్యకర్తలు మమేకమయ్యే బుగ్గన మంత్రి అయిన తర్వాత బిజీ షెడ్యూల్లో పూర్తిగా వారికి సమయం కేటాయించ లేకపోతున్నారు. దీంతో కార్యకర్తల్లో అసంతృప్తి ఎక్కువవుతోంది. నియోజకవర్గంలో నిరుద్యోగం, డోన్ మున్సిపాలిటీ అయినా రోడ్ల విస్తరణ చేయకపోవడం, ట్రాఫిక్ సమస్య, రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణాలు కూల్చి వేసినా రోడ్డు విస్తరణ చేసి, డివైడర్లు మౌలిక వసతులు కల్పించక పోవడం, తీవ్ర నీటి ఎద్దడి లాంటి సమస్యలు పరిష్కారం లేకుండా ఉన్నాయి. నియోజకవర్గంలో గ్రామాలలో ఉన్న నాయకుల మధ్య వర్గ పోరు రోజురోజుకు పెరిగిపోతోంది. ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామంలో వైఎస్ఆర్ నాయకులు ఒకరిపై ఒకరు రాళ్లతో కర్రలతో దాడులు చేసుకున్నారు, అలానే ఫ్యాపిలీ మండలం చిన్న పూజార్ల గ్రామంలో వై ఎస్ ఆర్ సి పి నాయకుల వర్గపోరు వలన సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటున్న వ్యక్తి దారుణ హత్య కు గురయ్యారు.