Dec 7, 2020, 11:08 AM IST
తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా 35వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ 10,000 ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా నిలిచేందుకు ఈ రోజు దీక్ష చేపట్టారు. హైదరాబాదులోని తన నివాసంలో ఉదయం పదిగంటలకు దీక్షలో కూర్చున్నారు.