టిడిపి మహానాడుకు అడ్డంకులు... ఒంగోలులో పసుపు తోరణాలు, జెండాల తొలగింపు

May 26, 2022, 11:59 AM IST

ఒంగోలు: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈసారి మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్దమయ్యింది. ఇప్పటికే ఈనెల 27, 28 తేదీల్లో (శుక్ర, శనివారం) ప్రకాశం జిల్లా మండువవారిపాలెంలో మహానాడు నిర్వహణ కోసం టిడిపి ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఒంగోలు పట్టణంలో పసుపు తోరణాలు, ప్లెక్సీలు, జెండాలు ఏర్పాటుచేసారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వీటిని ఏర్పాటుచేసారంటూ ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది తోరణాలను, జెండాలను తొలగించారు. అధికారులు కావాలనే టీడీపీ మహానాడు ఏర్పాట్లకు అడ్డంకులు సృష్టిస్తున్నారని టిడిపి నాయకులు, కార్యకర్తల ఆరోపిస్తున్నారు.