మంగళగిరి ఎయిమ్స్ లో ఇదీ పరిస్థితి... వీల్ ఛైర్ పైనే వృద్దురాలి ఆందోళన

Aug 14, 2023, 2:03 PM IST

గుంటూరు : నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అంటూ సాగే తెలుగు సినిమా పాట మీకు గుర్తుండే వుంటుంది. ప్రభుత్వ హాస్పిటల్స్ లోని పరిస్ధితులు ఎంత దారుణంగా వుంటాయో ఈ పాట కళ్లకు కడుతుంది. ఇలాంటి పరిస్థితే మంగళగిరి ఎయిమ్స్ లో ఓ వృద్దురాలికి ఎదురయ్యింది. నడవలేని పరిస్థితిలో వీల్ ఛైర్ పై హాస్పిటల్ కు వెళ్లిన వృద్దురాలు సిబ్బంది నిర్లక్ష్యంతో ఇబ్బందిపడ్డారు. దీంతో 80 ఏళ్ల ఆ వృద్దురాలు ఎయిమ్స్ ఎదుట ఆందోళనకు దిగింది.