నూజివీడులో విచిత్రం... ఉగాది పండగపూట మేకను పెళ్లాడిన యువకుడు

Apr 3, 2022, 11:27 AM IST

నూజివీడు: గతంలో అందాల నటి ఐశ్వర్యరాయ్, ఇటీవల నయనతార చెట్టును పెళ్ళాడారు. దోష నివారణలో భాగంగా ఇలా పెళ్లికిముందు అబ్బాయిలు, అమ్మాయిలు చెట్లును పెళ్లాడినట్లు అనేకచోట్ల చూస్తుంటాం. ఇలా దోష నివారణకై చెట్లనే కాదు మూగజీవులను కూడా పెళ్లాడుతుంటారు. ఇలా ఓ యువకుడు మేకను పెళ్లాడిన అరుదైన ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది. తన జాతకంలో రెండు పెళ్లిళ్లు జరుగుతాయని... దోష నివారణ కోసం ఓ మూగజీవిని పెళ్లాడాలని నూజివీడు యువకుడిని పండితులు సూచించారట. దీంతో ఉగాది రోజుల (శనివారం) నూజివీడులోని నవగ్రహ ఆలయంలో ఓ మేకను పెళ్లాడాడు యువకుడు.  అర్చకులే దగ్గరుండి మేకతో యువకుడికి వివాహం జరిపించారు.