Jan 19, 2022, 9:56 AM IST
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అప్రమత్తమైన జగన్ సర్కార్ నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. గత రాత్రి నుండే నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో వుంది. ఈ సమయంలో ఇళ్లలోంచి బయటకు వచ్చిన వారిని, వాహనాలపై రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. అత్యవసర పనులపై బయటకు వచ్చిన వారిని వదిలిపెట్టి అనవసరంగా బయటకు వచ్చిన వారిని హెచ్చరించి వదిలేసారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రజానికాన్ని కోరుతున్నారు. వైద్యరంగం, శానిటేషన్ ఉద్యోగులు తదితర ప్రంట్ లైన్ వారియర్స్ కు ఈ కర్ప్యూ నుండి మినహాయింపు ఇచ్చారు.