Nov 23, 2019, 10:52 AM IST
జీవీఎంసి 64 వ వార్డు హై స్కూల్ రోడ్ పెంటయ్య నగర్ ప్రాంతంలో నివసిస్తున్న యువజంట సేనాపతుల నరేంద్ర, డిల్లీశ్వరి లు ఆత్మహత్య చేసుకున్నారు. వీరు పెద్దలను కాదని పెళ్లి చేసుకొన్నారు. ఇరువురు రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో రెండు నెలల క్రితం గాజువాక పెంటయ్యనగర్ లో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. తాము నివాసం ఉంటున్న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని నవ దంపతులు ఉరేసుకొన్నారు. ఈ నవదంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారనే విషయమై స్పష్టత రాలేదు.