విజయదశమి పర్వదినాన... శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకరణలో విజయవాడ దుర్గమ్మ

Oct 15, 2021, 12:59 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో గతకొన్ని రోజులుగా వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. శుక్రవారం విజయదశమి సందర్భంగా అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వామహస్తంలో చెరకుగడను ధరించి, దక్షిణ హస్తంతో అభయ ముద్రతో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. 
 
ఇవాళ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్, మంత్రి ధర్మాన కృష్ణదాస్ అమ్మవారికి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అమ్మవారి దర్శనం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ మరింత మేలు జరగాలని అమ్మవారిని ప్రార్ధించానన్నారు. ఈ నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.