Andhra News: జగన్ ఫోటోతో చాంబర్ లో అడుగుపెట్టి... అభిమానం చాటుకున్న మంత్రి నారాయణస్వామి

Apr 18, 2022, 2:14 PM IST


అమరావతి: రెండోసారి కూడా మంత్రి పదవి దక్కించుకున్న నారాయణస్వామికి తిరిగి డిప్యూటీ సీఎంగా నియమించడమే కాదు ఎక్సైజ్ శాఖ బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. ఈ క్రమంలో ఇవాళ (సోమవారం) సెక్రటేరీయేట్ లోని తన ఛాంబర్లో నారాయణస్వామి బాధ్యతలు స్వీకరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటో పట్టుకుని తన చాంబర్లోకి ప్రవేశించి పండితుల మంత్రోచ్చరణల మధ్య ఎక్సైజ్ శాఖ బాధ్యతలు స్వీకరించారు.  బడుగుల దేవుడిగా జగన్ అవతరించారని.. అందుకే ఆయన చిత్రపటానికి పూజలు చేసి బాధ్యతలు స్వీకరించినట్లు మంత్రి నారాయణ స్వామి వెల్లడించారు.