ఈసారి ఫెయిల్ అయినోళ్లకే... ఎప్పుడో పది, పద్దతి తప్పిన కుక్కలకు కాదు: నాని, వంశీకి లోకేష్ చురకలు

Jun 9, 2022, 2:40 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి రిజల్ట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతుండగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు మరికొందరు వైసిపి నాయకులు వీడియో కాల్ లో పాల్గొన్నారు. వీరు ఏదో మాట్లాడేందుకు ప్రయత్నించినా మ్యూట్ లో వుండటంతో మాట్లాడలేకపోయారు. ఈ వ్యవహారంపై లోకేష్ స్పందిస్తూ... ఇది ఈ ఏడాది ఫెయిల్ అయ్యిన వాళ్ళకే... ఎప్పుడో పది పరీక్షలు, పద్దతి తప్పిన వైసిపి కుక్కలకు కాదంటూ చురకలు అంటించారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతుంటే దద్దమ్మలుగా, చేతకానొళ్లలా వీడియో పాల్గొనడం ఏమిటని అన్నారు. మా పార్టీ నుండి కొని తీసుకెళ్లిన ఒకరు, సన్నబియ్యం మంత్రి కాల్ లోకి వచ్చి  ఏం  సాధించాలనుకుంటున్నారో అర్థం కావడంలేదన్నారు. మీకు నిజంగానే చిత్తశుద్ది వుంటే ప్రిజినరీ జగన్ కు చెప్పండి... రీ వెరిఫికేషన్, సప్లిమెంటరీ ఉచితంగా చెద్దామని. పదో తరగతి రిజల్ట్స్ తర్వాత జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై ఈ సన్నబియ్యం సన్నాసి, వంశీ ఏం సమాధానం చెబుతారు అని లోకేష్ విరుచుకుపడ్డారు.