Nov 15, 2019, 4:59 PM IST
నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గంలో స్థానిక పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న టిడిపి కార్యకర్త కార్తీక్ కేసు విషయమై నెల్లూరు రూరల్ డిఎస్పి రాఘవరెడ్డిని నారా లోకేష్ కలిసాడు. ఎస్సై, వైకాపా నాయకుల పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చెయ్యాలని కోరారు. తగిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి రాఘవ రెడ్డి హామీ ఇచ్చారు.