Apr 16, 2022, 11:15 AM IST
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటన కోసం పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ తో శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన హరిజన గణేష్, ఈశ్వరమ్మ దంపతుల ఏడాది చిన్నారి బలైంది. ఇది ముమ్మాటికీ మంత్రి, పోలీసులు చేసిన హత్యే. అనారోగ్యంతో చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తున్నామని ప్రాధేయపడినా, పోలీసులు వదలకపోవడంతోనే నడిరోడ్డుపైనే కన్నుమూసింది చిన్నారి. మీ ఆర్భాటాల కోసం శిశువుల్ని చంపేయడమే శిశు సంక్షేమమా మంత్రి గారు! చిన్నారి కొనప్రాణాలతో కొట్టుకుంటున్న కనికరించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.