గుంటూరులో రమ్య ఇంటివద్ద ఉద్రిక్తత... పరామర్శకు వెళ్ళిన నారా లోకేష్ అరెస్ట్

Aug 16, 2021, 2:13 PM IST

గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్యను ప్రేమపేరుతో వేధిస్తూ చివరకు ఆమె ప్రాణాలను బలితీసుకున్నాడు ఓ కిరాతకుడు. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే రమ్యను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు శశికృష్ణ. ఈ దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో రమ్య కుటుంబాన్న పరామర్శించడానికి వెళ్లిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రమ్య నివాసానికి చేరుకోవడానికి ప్రయత్నించిన లోకేష్ తో పాటు మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు తదితరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిని నల్లపాడు పీఎస్ వైపు తీసుకెళ్తున్నారు పోలీసులు.