May 16, 2021, 9:58 PM IST
తన భర్తను గుంటూరు జైలుకు తరలించిన నేపథ్యంలో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు సతీమణి రమాదేవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్త క్రిమినల్ కాదని ఆమె అన్నారు. తన భర్తకు ఏదైనా జరిగితే సీఎం జగన్, సీఐడీ డీఐజీ సునీల్ బాధ్యత వహించాలని ఆమె అన్నారు. తన భర్తను జైల్లో చంపడానికి కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు.