Nov 7, 2022, 5:28 PM IST
అమరావతి : ఎస్సీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ చదవాలనుకునే విద్యార్థులకు ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున గుడ్ న్యూస్ చెప్పారు. ఎస్సీ గురుకులాల్లో డిమాండ్ లేని కోర్సుల స్థానంలో విద్యార్థులు ఎక్కువగా చదివే కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు ఎంఈసి వంటి కోర్సులు కొనసాగగా వచ్చే విద్యాసంవత్సరం నుండి బైపిసి, ఎంపిసి కోర్సులు ప్రారంభించనున్నట్లు... ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి నాగార్జున ఆదేశించారు.