Apr 8, 2020, 10:25 AM IST
ఎంపీ కేశినేని నాని విజయవాడలోని ఎనికేపాడులో లక్ష కోడిగుడ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం కరోనా మహమ్మారిని పారద్రోలడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వెయ్యి రూపాయల పంపిణీని వైసీపీ నాయకులు రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా పారాసిటమల్, బ్లీచింగ్ అంటూ మొద్దు నిద్రలొనే ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వెయ్యి రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి కుటుంబానికి ఐదువేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.