Aug 6, 2022, 12:22 PM IST
అమరావతి : ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఫోరెన్సిక్ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. తన వీడియో మార్ఫింగ్ చేసారని ఇద్దరు టీడీపీ నేతలపై మాధవ్ ఆరోపణలు గుప్పించారు. అయితే టీడీపీ నాయకులు తాము ఎలాంటి విచారణకైనా సిద్ధం అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక వైసీపీ కూడా దీనిమీద సీరియస్ గానే ఉంది. వీడియో మార్ఫింగ్ కాదని తేలితే కఠిన చర్యలు తప్పవని సజ్జల ప్రకటించారు. ఇదలా ఉండగా అతని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళా ఎంపీలు కోరుతున్నారు.