Aug 21, 2022, 2:42 PM IST
గుంటూరు : తనకు ఎలాంటి సమాచారం లేకుండా మీడియా సమావేశం ఏర్పాటుచేసిన వైసిపి నాయకులు, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరులను ఆ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ హెచ్చరించారు. తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఎమ్మెల్యే అనుచరులను చూసిన ఎమ్మెల్సీ వారివద్దకు వెళ్ళి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం తాడికొండ అదనపు సమన్వయకర్తగా తనను నియమించారని... కాబట్టి ఇకపై తనకు తెలియకుండా ఇలాంటి పార్టీ కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించారు. అయితే ప్రజలకు తమ బాధ చెప్పుకోవడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసామని ఎమ్మెల్యే అనుచరులు చెప్పడంతో ఎమ్మెల్సీ డొక్కా అక్కడినుండి వెళ్లిపోయారు.