Jul 1, 2020, 10:41 AM IST
విశాఖ ఏజెన్సీలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జి.మాడుగుల మండల కె. కోడాపల్లి పంచాయతీ జిన్నేరు గ్రామానికి చెందిన 15 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచార ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తల్లిదండ్రులు లేని ఆ అమ్మాయిఅత్తా మామల సంరక్షణలో ఉంటుంది. ఈనెల 27వ తేదీన పేకాటరాయుళ్లు మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఊరికి దూరంగా ఉన్న ఇంట్లోని 15 సంవత్సరాల మైనర్ బాలికపై బందవిధి, గుర్రాయి గ్రామాలకు చెందిన యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కేకలు విని అటుగా వెళుతున్న పాంగి సూర్యకాంతం ఇంట్లోకి వెళ్లగా నిందితుడు బీరు బాటిల్తో భయపెట్టాడు. ఆమె గ్రామస్తులను పిలుచుకొని వచ్చేలోపు జరగరాని ఘోరం జరిగిపోయిందని గ్రామస్థులు తెలిపారు.