కరోనా న్యూవేరియంట్ బిఎఫ్7 పై ఏపీ హైఅలర్ట్... మంత్రి రజని కీలక ఆదేశాలు

Dec 23, 2022, 3:55 PM IST

అమరావతి : పొరుగుదేశం చైనాలో మరోసారి కరోనా కొత్త వేరియంట్ బిఎఫ్7 ఇండియాలోకి ప్రవేశించిన నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి నివారణకు రాష్ట్రాలకు కీలక సూచనలివ్వగా... రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇలా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందస్తుగా అప్రమత్తం కావాలని అధికారులకు సూచించింది. వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని విశాఖ జివిఎంసి కార్యాలయంలో కరోనా న్యూవేరియంట్ పై అత్యవసర సమీక్ష నిర్వహించారు.   

 కరోనా బీఎఫ్7పై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి రజని ఆదేశించారు. కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని... ప్రతి హెల్త్ సెంటర్లో రాపిడ్ టెస్టుల నిర్వహించేలా కిట్స్ సిద్దం చేయాలని ఆదేశించారు. ప్రజలు శానిటైజర్లు, మాస్కులు వాడేలా అవగాహన కల్పించాలని... వైద్యసిబ్బందికి పిపిఈ కిట్లు అందుబాటులో వుంచాలన్నారు. ఇప్పటివరకు వ్యాక్సినేషన్ వేయించుకోని వారు వేయించుకోవాలని... రెండు డోసులు పూర్తయినవారు కూడా బూస్టర్ డోస్ వేయించుకోవాలని సూచించారు. చలికాలం కావడంవల్ల వైరస్ వ్యాప్తి స్పీడ్ గా వుంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా వుండాలని మంత్రి రజని సూచించారు.