సింహాచలం అప్పన్న సన్నిధిలో దేవాదాయ మంత్రి వెల్లంపల్లి దంపతులు

Jun 17, 2021, 5:57 PM IST

విజయనగరం: గురువారం సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దంపతులు దర్శించుకున్నారు. సతీసమేతంగా వచ్చిన ఆయనకు దేవస్థానం ఈఓ సూర్యకళ, అధికారులు, ట్రస్టు బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం మంత్రి వెల్లంపల్లి కళ్యాణమండపాన్ని సందర్శించారు. శిల్పాలకు ప్రత్యేక తైలంతో శుద్ధిచేసిన కార్యక్రమాన్ని ప్రశంసించారు. కరోనా మహామ్మారిని ఆ సింహాద్రినాథుడు తరిమివేలాయలని మంత్రి ప్రార్థించారు.