Aug 31, 2022, 10:52 AM IST
అమరావతి : కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. లోకేష్ మాటలు వింటుంటే మాయాబజార్ లోని ఉత్తర కుమారుడు గుర్తుకు వస్తున్నాడంటూ రోజా ఎద్దేవా చేసారు. సీఎం జగన్ కాలిగోటికి కూడా సరిపోని నీకు ఆయనను విమర్శించే స్థాయి వుందా? అంటూ రోజా సూటిగా ప్రశ్నించారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది అంటూ రోజా ఫైర్ అయ్యారు. ''మీ తండ్రి కొడుకులకు అసలు సిగ్గుందా. మీ నాన్న ఇప్పటివరకు కుప్పానికి ఏం చేసాడో చెప్పుకోలేకపోయాడు. కానీ జగన్ కుప్పంకు ఎంతో చేసాడు . కాబట్టే ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ మీ పూసాలు కదిలేలా కుప్పం ప్రజలు బుద్దిచెప్పారు. మీ అమ్మను కన్న నాన్నను అడుగు మీ నాన్న ఎంత గొప్పోడో చెబుతాడు. అడ్డదారిలో సీఎం అయ్యింది నీ తండ్రి చంద్రబాబు. మీ నాన్నని జగన్ కుప్పం నడిరోడ్డులో కూర్చోబెట్టడం ఖాయం'' అంటూ లోకేష్ పై పర్యాటక శాఖ మంత్రి రోజా తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.