నిరుద్యోగులకు మంత్రి పెద్దిరెడ్డి గుడ్ న్యూస్.. జూపార్కుల్లో ఉద్యోగాల భర్తీపై కీలక ఆదేశాలు

Nov 29, 2022, 4:49 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో జూపార్కుల అభివృద్దికి వైసిపి ప్రభుత్వం కృషిచేస్తోందని... ఇందులో భాగంగా జూపార్క్ లలో  డైరెక్టర్, క్యూరేటర్ వంటి కీలక పోస్టులను భర్తీ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో జూపార్క్ లను మరింత ఆకర్షణీయంగా చేయడానికి, కొత్త జంతువులను జూ లలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఫారెస్ట్ డివిజన్ పరిధిలోనూ ఒక ఎకో పార్క్ ను ఏర్పాటు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి అటవీ అధికారులను ఆదేశించారు.  

 సచివాలయంలోని మూడో బ్లాక్ లో అటవీశాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఇఎఫ్ఎస్&టి) నీరబ్ కుమార్ ప్రసాద్, అటవీదళాల అధిపతి వై. మధుసూదన రెడ్డి, పిసిపిఎఫ్ ఆర్పీ ఖజూరియా, డిఎఫ్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.