ప్రభుత్వ హాస్టల్లో మంత్రి నాగార్జున ఆకస్మిక తనిఖీ... వార్డెన్ పై చర్యలకు ఆదేశం

Nov 16, 2022, 12:36 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అమరావతిలోని ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్, అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. హాస్టల్లో విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్న మంత్రి వాటి పరిష్కారానికి అక్కడే అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలోనే విద్యార్థుల బాగోగులు చూసుకోవాల్సిన వార్డెన్ గుంటూరులో వుంటూ రెండుమూడురోజుల ఒకసారి వస్తున్నారంటూ విద్యార్థులు మంత్రికి ఫిర్యాదు చేసారు. దీంతో వెంటనే సదరు వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి నాగార్జున ఆదేశించారు. ఇక అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో పదోతరగతి విద్యార్థినులతో మంత్రి మాట్లాడారు. విద్యతో పాటు పరీక్ష విధానం, స్టడీ అవర్స్ మరియు క్రీడల గురించి అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యావ్యస్థలతో చాలా మార్పులు వచ్చాయని మంత్రి నాగార్జున పేర్కొన్నారు.