కేంద్రానికి కాదు బైడెన్, పుతిన్ లకు చెప్పుకో...: పవన్ కు అమర్నాథ్ కౌంటర్...

Aug 11, 2023, 12:37 PM IST

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ కు మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానన్న పవన్ వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు. కేంద్రానికి కాదు బైడెన్, పుతిన్ లకు చెప్పుకో... ఇక్కడ భయపడేవారు ఎవ్వరూ లేరన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో వుండగానే శక్తివంతమైన మహిళ సోనియా గాంధీనే ఎదిరించిన మొనగాడు వైఎస్ జగన్... ఆయనను నీలాంటి వారు ఏమీ చేయలేరంటూ పవన్ కు మంత్రి అమర్నాథ్ కౌంటరిచ్చారు.