కేసీఆర్ ని పాలల్లో ముంచిన ఎర్రబెల్లి దయాకర్ రావు..

May 9, 2020, 3:47 PM IST

వరంగ‌ల్ రూర‌ల్ జిల్లా, ప‌ర్వ‌త‌గిరి మండ‌లం అన్నారం గ్రామాల్లో కెసిఆర్ చిత్ర ప‌టానికి  రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖా మాత్యులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పాలాభిషేకం చేశారు. కరోనా ఎఫెక్ట్ కార‌ణంగా మొత్తం ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాభిన్న‌మైన త‌రుణం‌లో అంద‌రికంటే ముందే లాక్ డౌన్ విధించి దేశానికే కేసిఆర్ ఆదర్శమయ్యారన్నారు. లాక్ డౌన్ కాలంలో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రానివ్వకుండా ఆదుకున్నారని చెప్పారు. పేదలకు ఉచిత రేషన్, రైతుబంధు, పంటబీమా, ధాన్యం కొనుగోలులాంటి వాటితో ప్రజల్ని ఆదుకున్నారంటూ కొనియాడారు.