Apr 22, 2022, 2:31 PM IST
విజయవాడ: విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మానసిక దివ్యాంగురాలిని హాస్పిటల్ లోని ఓ గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ప్రస్తుతం యువతి అదే హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా పరామర్శించడానికి మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు యువతిని పరామర్శించడానికి వస్తుండగా టిడిపి మహిళా నాయకురాళ్ళు అక్కడికి చేరుకున్నారు. వీరు వాసిరెడ్డి పద్మ ను అడ్డుకోడానికి ప్రయత్నిస్తూ ఆమెతో వాగ్వివాదానికి దిగారు. ఆస్పత్రి నుంచి వెళ్లిపోవాలంటూ మహిళలు నినాదాలు చేసారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు వాసిరెడ్డి పద్మకు రక్షణగా నిలిచారు.