Mar 19, 2022, 12:55 PM IST
మంగళగిరి బైపాస్ రోడ్డు వద్ద ఉన్న మిశ్రా దాబాలో వాచ్ మెన్ ని నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో శనివారం హోటల్ మంగళగిరి పోలీసులు వద్ద విచారణ జరిపారు. నిందితులు మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కత్తిపోట్లకు గురైన వాచ్ మెన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు హోటల్ యజమాని తెలిపారు.