Nov 1, 2019, 3:13 PM IST
పోలవరం ప్రాజెక్టు వద్ద శుక్రవారం మేఘా సంస్థ పూజా కార్యక్రమాలు నిర్వహించింది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ లో పోలవరం ప్రధాన డ్యామ్, జలవిద్యుత్ ప్రాజెక్టు పనులను మేఘా
కంపెని దక్కించుకుంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు గురువారం నాడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు గురువారం నాడు నిర్ణయం తీసుకొంది