Nov 2, 2019, 5:12 PM IST
పోలవరంలో శనివారం మెఘా సంస్థ పనులు ప్రారంభమయ్యాయి. శుక్రవారమే అధికారంకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన మెఘా సంస్థ పనులను మాత్రం ఇవాళ్టి నుండి ప్రారంభించారు. రేయింబవళ్లు కష్టపడి పనులు నిర్వహించి అనుకున్న సమయానికి ప్రాజెక్టును సిద్ధం చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అత్యంత నాణ్యతతో నిర్మాణం చేపడతామని తెలిపారు. రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయడానికి కంకణబద్ధమయ్యామని అన్నారు.