మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్.. యువతి వద్ద 48 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు అరెస్ట్..

Sep 14, 2022, 2:48 PM IST

పల్నాడు జిల్లా : జీవనసాతి మ్యాట్రిమోనిలో కొచ్చర్ల శ్రీకాంత్ పేరుతో యువతులను మోసం చేస్తున్న పొట్లూరి వంశీకృష్ణ అనే సైబర్ నెరగాన్నిపల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల నరసరావుపేట కి చెందిన ఓ యువతి వద్ద 48 లక్షలు నిందితుడు వంశీకృష్ణ కాజేశాడు. తాను అమెరికా లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నానని  యువతిని ఆన్లైన్లో పరిచయం చేసుకున్నాడు నిందితుడు వంశీకృష్ణ. అతడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద 38 లక్షలు పోలీసులు రికవరీ చేశారు. వంశీకృష్ణపై గతంలో ఎనిమిది కేసులు ఉన్నట్లు మీడియా సమావేశంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి  తెలిపారు.