Dec 18, 2020, 11:48 AM IST
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గీతారెడ్డి(28) ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.