Nov 18, 2019, 3:50 PM IST
విజయవాడ వాంబే కాలనీలో అన్నాదమ్ముల మధ్య గొడవ చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చింది. కృష్ణ, యేసు అనే అన్నదమ్ముల మధ్య మొదలైన గొడవల్లో యేసు కుమార్తె ఆరేళ్ల జానకిని రెండంతస్తుల భవనం మీదినుండి కిందికి తోశాడు కృష్ణ. తీవ్రగాయాలైన జానకిని స్థానికులు వెంటనే గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జానకి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.