చోడవరంలో ఉద్రిక్తత... విశాఖ రాజధాని కోసం నడిరోడ్డుపై యువకుడి ఆత్మహత్యాయత్నం

Oct 13, 2022, 4:11 PM IST

అనకాపల్లి : జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. చోడవరం నియోజకవర్గానికి చెందిన యువకుడు స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మూడు రాజధానులకు మద్దతుగా చేపట్టిన బైక్ ర్యాలీలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే యువకుడు ఒక్కసారిగా జై విశాఖ... జైజై విశాఖ అంటూ నినాదాలు చేస్తూ తన బైక్ కు నడిరోడ్డుపైనే నిప్పంటించాడు. అనంతరం అతడు కూడా నిప్పంటించుకోడానికి ప్రయత్నించగా గమనించిన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ధర్మశ్రీతో పాటు ఇతర నాయకులు యువకున్ని సముదాయించారు.