ఏసీ నీళ్లు పడుతున్నాయని చెప్పినందుకు.. కత్తితో దాడి, ముగ్గురి పరిస్థితి విషమం...

Sep 14, 2022, 11:37 AM IST

గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటుచేసుకుంది.  ఏసీ నీళ్లు ఇంట్లో పడుతున్నాయని పక్కింట్లో నివాసముండే వ్యక్తులపై కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం రాత్రి జంగిలి మురళి అనే వ్యక్తి నాయిని సాయివరుణ్ తేజ్, మామిడాల పోచయ్య,శేఖర్ అనే వ్యక్తులపై కత్తితో దాడి చేసినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. జంగిలి మురళి, మామిడాల పోషం ప్రక్క ప్రక్కన నివాసముంటారు. మురళి ఇంట్లోని ఏసీ నీళ్లు పోషం ఇంట్లో పడుతుండటంతో నీళ్ల పైపు మార్చాలని పోషం చెప్పాడు. దీంతో ఆగ్రహించిన మురళి ఇంట్లో ఉన్న కత్తితో పోషంను పోడవగా...అడ్డు వచ్చిని అతని మనువడు సాయికిరణ్ ను ,గొడవను నివారించడానికి వెళ్లిన శేఖర్ లను కూడా మురళి కత్తి తో పోడిచాడు. ముగ్గురుని గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పతికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.