Jun 4, 2021, 3:42 PM IST
విశాఖపట్నం: ''లలితా... నీకు నేను అన్యాయం చేశారు. నువ్వు మరో పెళ్లి చేసుకుని సుఖంగా వుండు. బాబును బాగా చూసుకో. మళ్లీ జన్మంటూ ఉంటే నీవే నా భార్య కావాలని కోరుకుంటా'' అంటూ సూసైడ్ లెటర్ రాసి అరుణ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయాత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖలోని గోపాలపట్నంలో చోటుచేసుకుంది. గోపాలపట్నం బాజీ జంక్షన్ సబ్ స్టేషన్ వద్ద అరుణ్ అనే యువకుడు చేతి మణికట్టు కోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కలహాల కారణంగా ప్రస్తుతం పుట్టింట్లో వుంటున్న భార్య రాకపోవడంతో మనస్తాపం చెంది సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడివున్న అతడిని గోపాలపట్నం పోలీసులు అంబులెన్స్ లో కేజీహెచ్ కి తరలించారు.