మచిలీపట్నంలో బార్ ముందు ఘర్షణ.. ఇద్దరికి తీవ్రగాయాలు..

Jul 16, 2022, 1:32 PM IST

మచిలీపట్నంలో ఓ వ్యక్తి  మరో వ్యక్తి మీద బీర్ బాటిల్ తో దాడి చేశాడు. అప్పటికీ కసితీరకపోవడంతో కత్తితో పొడిచాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.మచిలీపట్నం : మచిలీపట్నం లక్ష్మిటాకీసు సెంటర్ రామ్ సాయి బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బీరు బాటిల్ తో తలపై కొట్టడంతో కర్రి పవన్ కుమార్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గొడవను అదుపు చేయడానికి మధ్యలో వెళ్లిన యర్రంశెట్టి నానికి గాయాలయ్యాయి. కట్టా భవానీ కృష్ణ అనే వ్యక్తి ముందు బీరు బాటిల్ తో దాడిచేసి, ప్రతీకారం తీరక కత్తితో దాడి చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.