Aug 17, 2023, 3:10 PM IST
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గత రాత్రినుండి ఉద్రిక్తత కొనసాగుతోంది. రోడ్డు విస్తరణకు అడ్డంగా వున్నాయంటూ గాంధీ సెంటర్ లోని రాజకీయ నాయకులు, మహనీయుల విగ్రహాలను అధికారులు అర్ధరాత్రి పోలీసులు తొలగించారు. అయితే ఎలాంటి సమాచారం లేకుండా విగ్రహాలను తొలగించడాన్ని తప్పుబడుతూ టిడిపి శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆందోళను దిగారు. దీంతో నందిగామలో అర్ధరాత్రి అలజడి రేగింది. అయితే తమను నిర్మంధించి జాతిపిత మహాత్మా గాందీ విగ్రహంతో పాటు మరికొన్ని విగ్రహాలను అధికారులు తొలగించారు... కానీ ఆ విగ్రహాలను టాయి లెట్స్ వద్ద పడేసి మహనీయులను అవమానించారంటూ సౌమ్య ఉదయం మరోసారి ఆందోళనకు దిగారు. టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు మాజీ ఎమ్మెల్యే. దీంతో నందిగామలో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.